మానవ జీవితంలో వాస్తుశాస్త్రం ఆచరణీయమైన పరిజ్ఞానంగా కలిసిపోయింది. కృతయుగం నుంచి కలియుగం వరకు అన్ని యుగాలలోనూ ఈ శాస్త్రం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కొంత మంది మాత్రమే ఈ వాస్తు శాస్త్రం ప్రయోజనాలను పొందారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో వాస్తుశాస్త్రం ఉపయోగపడుతుంది. వాస్తుశాస్త్రం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనం కొరకు గృహం నిర్మించుకోవడానికి ఈ శాస్త్రం ఉద్దేశింపబడినది.
* తూర్పు దిక్కున వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని రకాలుగా బాగున్నది. వాస్తు దోషం లేని ఇల్లు కట్టుకుంటే అది కొందరికి మాత్రమే కలిసి వస్తుంది.
* ఉత్తర ముఖంగా ఇల్లు కట్టుకుంటే వాస్తు ప్రకారం ఏ రకమైనటువంటి లోపం లేకున్నా.. కొంత మందికి కలిసి వస్తుంది, కొంత మందికి కలిసిరాదు.
* దక్షిణ ముఖంగా ఇల్లు కట్టుకుంటే కొంత మంది ఇబ్బంది పడతారు, మరికొంత మంది విశేషమైన అసైశ్వర్యాలను, అధికారాన్ని, అత్యున్నతమైన విద్యను పేరు ప్రతిష్ఠలను సంపాదించుకోగలుగుతారు.
* పడమర దిక్కున వాస్తుదోషం లేకుండా ఇల్లు కట్టుకుంటే కొంత మందికి బాగా కలిసి వస్తుంది. కొంతమంది సర్వం కోల్పోతారు.
వాస్తు బాగా ఉన్నటువంటి పరిస్థితిలో కొంత మందికి కలిసిరావడం, కలిసిరాక పోవడానికి కారణం ఏమిటి? వాస్తు ప్రకారం కట్టినటు వంటి ఇల్లు ఏ దిక్కున ఉన్నా యజమాని జాతకానికి అది సరిపోవాలి. అప్పుడు వాస్తు శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం కార్యరూపం దాలుస్తుంది.
ప్రధానంగా ఏ దిక్కున ఇల్లు కట్టుకున్నా, ఏ రకమైనటువంటి శాస్త్రం వీధిపోటు ఉన్నా, ఏ దిక్కులోనైనా హెచ్చుతగ్గులు ఉంటే వాస్తుశాస్త్ర సంబంధ మైనటువంటి దుష్పలితాలు వర్తించవు. ప్రధానంగా జాతకం బాగుండాలి. ఆ జాతకానికి ఆ ఇంటి వాస్తుకి, దిక్కుకి సరిపోతే అదృష్ట వంతమైన రోజులు, అనుకూలమైన రోజులు సంప్రాప్తిస్తాయి. అన్నివిధాలుగా అభివృద్ధి సాధించగలుగుతారు. ఏది ఏమైనా ప్రధానమైన విషయం ఏమిటంటే జాతకానికి, వాస్తుకి పొంతన సరిపోవాలి. గ్రహగతులు, వాస్తు స్థితిగతులు ఒకే నాణానికి ఇరువైపుల వంటివి. వీటిని పరిగణలోకి తీసుకోకుండా చేసే పనులు అంతగా కలిసిరావు.
పడమర నైరుతి వీధిపోటు తప్ప మిగిలిన అన్నిరకాల వీధిపోట్లు కలిసివస్తాయి. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడని, ఈశాన్య దిక్కుకి ఈశ్వరుడు అధిపతి అని కొంతమంది చెబుతుంటారు. దిక్పాలకుల్లో ఒక్కడైనటువంటి ఈశాన్యుడు వేరు, పరమేశ్వరుడు వేరు. పరమేశ్వరుడు సమస్త లోకాలు అధిపతి. ఆయన సంకల్పంతోనే సమస్త లోకాలకు సంచరిస్తుంటాయి. మహాదేవుణ్ణి ఈశాన్య దిక్కుకి పరిమితం చేయడం ధర్మశాస్త్రరీత్యా ఆక్షేపణీయమైనది. ఏదిఏమైనా మీ జాతకం ప్రకారం, లగ్నం ప్రకారం, మీకు నడుస్తున్న దశ ప్రకారం వాస్తుశాస్త్రం మీకు ఉపయోగపడుతుంది.
