ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి.. మరింత గ్యాస్ సంక్షోభం తప్పదా..?

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి.. మరింత గ్యాస్ సంక్షోభం తప్పదా..?

ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరా అంతరాయంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే అనుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేయడం.. ప్రపంచాన్ని మరింత గ్యాస్ సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

బుధవారం (మార్చి 18) అర్ధరాత్రి తర్వాత ఖతార్ లోని ఖతారీ కాంప్లె్క్స్ అనే ఎల్ఎన్జీ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ప్లాంట్ భారీ ఎత్తున దెబ్బతిన్నట్లు గల్ఫ్ అప్ మీడియా వెల్లడించింది. ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సప్లై చేసే ది రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ప్లాంట్ పై దాడి జరగటం ఆందోళన కలిగించే అంశం. యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్లాంట్ ను మూసివేశారు. అయినప్పటికీ బుధవారం రాత్రి ఇరాన్ మిస్సైల్ దాడితో చాలా డ్యామేజ్ జరిగినట్లు ఖతార్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడితో అబుధాబి అలర్ట్ అయ్యింది. అక్కడ ఉన్న హబ్షాన్ ప్లాంట్ ను వెంటనే మూసివేశారు. 

అర్ధరాత్రి తర్వాత గ్యాస్ ప్లాంట్ పైన దాడి జరిగిన తర్వాత.. గురువారం ఉదయం కూడా మిస్సైల్స్ దాడులు కొనసాగినట్లు ఖతారీ అధికారులు వెల్లడించారు. ఈ దాడులతో పర్షియన్ గల్ఫ్ లోని గ్యాస్ ఫీల్డ్స్ పై దాడులు మరింతగా పెరిగినట్లు గల్ఫ్ మీడియా పేర్కొంది. అంతకు ముందుద ఇరాన్ అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ పార్ గ్యాస్ పై దాడి జరిగిన తర్వాత.. క్రూడ్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పేలడంతో.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ గ్యాస్ క్షేత్రాలను టార్గెట్ చేస్తామన్న ఇరాన్.. అన్నట్లుగా ఖతార్ లోని అతిపెద్ద గ్యా్స్ ఫీల్డ్ పైదాడి చేసింది. 

ఇరాన్ దాడితో హబ షాన్ గ్యాస్ ఫీల్డ్ దగ్గర పలువురు సిబ్బంది గాయపడినట్లు అబుధాబీ మీడియా పేర్కొంది. మరోవైపు సౌత్ రియాద్ రిఫైనరీ కసమీపంలో మిస్సైల్స్ పడినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఖతార్ లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ.. అతిపెద్ద నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ సెంటర్. 295 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ చమురు క్షేత్రం న్యూయార్క్ సిటీలో మూడవ వంతు ఉంటుందంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎల్ఎన్జీ ప్రాసెసింగ్, గ్యాస్ నుంచి లిక్విడ్ కు మార్చే ఫెసిలిటీ, ఎల్ఎన్జీ స్టోరేజ్ మొదలైన ఏర్పాట్లు ఉన్నాయి. 

ఇక నుంచి ఇజ్రాయెల్ దాడులు ఉండవు.. కానీ: ట్రంప్

ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పై ఇరాన్ దాడి తర్వాత ఇక నుంచి ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని విలువైన సౌత్ పార్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ దాడి చేయదని చెప్పారు. అమాయక ఖాతర్ లాంటి దేశాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు. 

ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పై మొదట దాడి చేసిన ఇజ్రాయెల్ హింసాత్మకంగా వ్యవహరించిందని అమెరికా చీఫ్ కమాండర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి అమెరికాకు ముందస్తుగా ఏమీ తెలియదని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ అమాయక ఖతార్ పై దాడికి దిగినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఇక నుంచి గ్యాస్ ఫీల్డ్స్ పై దాడి చేయదని అమెరికా ప్రకటించింది. విలువైన గ్యాస్ క్షేత్రాలను ధ్వంసం చేసుకుంటే మరింత గ్యాస్ సంక్షోభం వస్తుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.