Dhurandhar 2: రణవీర్ సింగ్ బాక్సాఫీస్ ఊచకోత.. 'ధురంధర్ 2'పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!

Dhurandhar 2: రణవీర్ సింగ్ బాక్సాఫీస్ ఊచకోత.. 'ధురంధర్ 2'పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే 'ధురంధర్: ది రివెంజ్'. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ రోజు ( మార్చి 19, 2026 ) థియేటర్లలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాన్ ను సొంతం చేసింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీట్లో కూర్చుండిపోయేలా ఉందంటూ ప్రశంసలు అందుకుంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చేలా ఉందని టాక్ వినిపిస్తోంది.  కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూస్తుంటే, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మరో మెట్టు ఎక్కినట్లు స్పష్టమవుతోంది.

 'ఐకాన్ స్టార్' స్పెషల్ రివ్యూ

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో 'ధురంధర్: ది రివెంజ్' స్పెషల్ స్క్రీనింగ్‌ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇటీవల ప్రారంభమైన తన సొంత థియేటర్ 'అల్లు సినిమాస్'లో ఈ చిత్రాన్ని వీక్షించిన బన్నీ, సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినీ బృందానికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. "ధురంధర్ 2 అంటే దేశభక్తికి అద్దం పట్టే స్టైలిష్ యాక్షన్. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందన్నారు. 

RVS ఈజ్ ఆన్ ఫైర్..

ఈ మూవీలో క్లాప్స్ కొట్టించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైనర్" అని అల్లు అర్జున్ తన రివ్యూలో పేర్కొన్నారు. ముఖ్యంగా తన సోదర సమానమైన రణవీర్ సింగ్ నటనను ప్రశంసిస్తూ, "RVS ఈజ్ ఆన్ ఫైర్" అని, మన దేశంలో ఇలాంటి వెర్సటైల్ నటుడు ఉండటం గర్వకారణమని కొనియాడారు. అలాగే దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ, ఆయన బంతిని స్టేడియం దాటించేశారని (Hit the ball out of the park) ప్రశంసించారు.

 

ఆర్. మాధవన్ ఎమోషనల్ రెస్పాన్స్
అల్లు అర్జున్ రివ్యూపై సీనియర్ నటుడు ఆర్. మాధవన్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. "నీలాంటి గొప్ప నటుడి నుండి, అదీ నా కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయంలో ఇలాంటి ప్రశంస రావడం ఎంతో స్ఫూర్తినిస్తోంది బ్రదర్" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ తన నటనతో మెప్పించారు.

 

కథా నేపథ్యం..
ఈ సీక్వెల్ మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. జస్కిరాత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్), పాకిస్థాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి ఎలా చొచ్చుకెళ్లాడు? హమ్జా అలీ మజారీగా ఎలా రూపాంతరం చెందాడు? అన్న అంశాలను దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతంగా ఆవిష్కరించారు. కరాచీ మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే క్రమంలో రణవీర్ చేసే పోరాటం రోమాంచితంగా ఉంటుంది. ఇందులో అర్జున్ రాంపాల్ (మేజర్ ఇక్బాల్), సంజయ్ దత్ (ఎస్‌పీ చౌదరి అస్లాం) వంటి హేమాహేమీలు తలపడటం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

బాక్సాఫీస్ సునామీ!

అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. కేవలం సెలబ్రిటీలే కాకుండా, సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాను "ఇండియన్ స్టోరీ విత్ ఇంటర్నేషనల్ స్వాగ్" అని పిలుస్తున్నారు. ఓపెనింగ్ డే కలెక్షన్స్ చూస్తుంటే, ఈ సినిమా పాత రికార్డులన్నీ తుడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబట్టుతుందో చూడాలి.