ఎమోషనల్‌‌ లవ్‌‌ స్టోరీతో ఇట్స్ లైఫ్ బ్రో మూవీ... 

ఎమోషనల్‌‌ లవ్‌‌ స్టోరీతో ఇట్స్ లైఫ్ బ్రో మూవీ... 

కేఎం (కృష్ణమోహన్‌‌) హీరోగా సోమశేఖర్‌‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్స్‌‌ లైఫ్‌‌ బ్రో’. పూజా సుందర్‌‌ శెట్టి హీరోయిన్. కృష్ణ మోహన్‌‌ సల్లగుండ్ల  నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌‌లుక్‌‌ను హీరో నితిన్‌‌ విడుదల చేసి మూవీ టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో ఎమోషనల్‌‌ లవ్‌‌ స్టోరీగా తెరకెక్కిస్తున్నాం.  రియల్‌‌ లైఫ్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు. 

రాజీవ్‌‌ కనకాల, చమ్మక్‌‌ చంద్ర, అంబటి శ్రీనివాస్‌‌, దేవి ప్రసాద్‌‌, కిరీటి, త్రిశూల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు.