హీరోయిన్ కీర్తి సురేష్ శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ( జూన్ 27 ) భర్త ఆంటోనితో కలిసి శ్రీకాళహస్తి చేరుకున్న కీర్తి.. స్వామి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు కీర్తి సురేష్. ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కీర్తి సురేష్ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆలయం బయట ఫ్యాన్స్ కీర్తి సురేష్ తో సెల్ఫీలు దిగారు.
