యాదగిరిగుట్ట, వెలుగు: మునగ, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో సాగుతున్న క్రాప్ బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియలను జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న మునగ పంటను, ఆకుల పొడితో టీ బ్యాగులు, సూప్ తయారీ విధానాన్ని చూశారు. జిల్లాలోని 17 మండలాల్లో ఇలాంటి యూనిట్లు స్థాపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయిల్ పామ్ క్షేత్రాలను సందర్శించి, ‘నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్’ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
