విఐపీల భద్రతపై..ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం

విఐపీల భద్రతపై..ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం

విఐపీల భద్రతపై ఇంటెలిజెన్స్  విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. నక్సల్స, తీవ్రవాదం ఉన్న సమయంలో ప్రముఖులకు  కేటాయించిన భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని 100 మందికి పైగా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ పోలీస్ ఉన్నతాధికారుల గన్ మెన్లను  తొలగించింది. వివరాల్లోకి వెళితే.. 

ప్రముఖుల(వీఐపీ) భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నక్సల్స్,తీవ్రవాద ప్రభావం తగ్గడంతో ప్రముఖులకు సెక్యూరిటీ తగ్గించాలని భద్రతా కమిటీలో నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత భారీగా తగ్గించడంతో గన్ మెన్ లను ప్రభుత్వం తొలగించింది. ఇటీవల కమిటీ సమావేశమై ఇంటెలిజెన్స్  విభాగం సమాచారం మేరకు కొత్తగా ఎవరెవరికి భద్రత కల్పిం చాలి, ఎంత మేరకు కల్పించాలి అనేది నిర్ణయించిన ఇంటెలిజెన్స్ విభాగం.. భద్రత అవసరం లేని 100 మందికిపైగా మాజీ ప్రజా ప్రతినిధులు , మాజీ పోలీస్ ఉన్నతాధికారులకు గన్ మెన్ లను తొలగించింది.  

రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 600 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం.. ప్రభుత్వం సమకూర్చిన కొందరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా వెనక్కి తీసుకుంది.  రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు మావోయి స్టులు తప్ప ఎవరూ అజ్ఞాతంలో లేరని దాంతో చాలా మంది మాజీ పోలీసు అధికారులకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు భద్రత తొలగించాలని నిర్ణయించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.