స్టాలిన్‎కు మరో షాక్.. DMK కూటమికి MDMK గుడ్ బై

స్టాలిన్‎కు మరో షాక్.. DMK కూటమికి MDMK గుడ్ బై

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమిళనాడులో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష డీఎంకే పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం 64 ఏళ్ల సుధీర్ఘ బంధానికి ముగింపు పలుకుతూ డీఎంకే కూటమికి ఐయూఎంఎల్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. డీఎంకే కూటమికి మరో బిగ్ షాక్ తగిలింది. ఎండీఎంకే పార్టీ డీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంది. 

శనివారం (జూన్ 27) జరిగిన పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎండీఎంకేను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తూ డీఎంకేతో 9 ఏళ్ల బంధానికి డీఎండీకే ముగింపు పలికింది. ‘‘డీఎంకే కూటమిలో ఎండీఎంకేను బలహీనపర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక సీక్రెట్ ప్లాన్ ఉంది. అందువల్ల తమ పార్టీ కూటమిలో కొనసాగడం అసాధ్యం’’ అని డీఎండీకే పేర్కొంది. 

టీవీకే ప్రభుత్వంలో చేరికపై నో క్లారిటీ

డీఎంకే అలయన్స్ నుంచి బయటికొచ్చిన డీఎండీకే.. విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే కూటమిలో చేరికపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ విజయ్ ప్రభుత్వాన్ని డీఎండీకే స్వాగతించింది. అవినీతి రహిత పరిపాలనను కొనసాగించడం, మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై తమిళనాడు హక్కులను పరిరక్షించడం వంటి కీలక ఎన్నికల హామీలపై రాజీ పడకుండా ఉండాలని కోరింది.

మా వల్లే మీకు సీట్లు: డీఎంకే

డీఎండీకేను బలహీనపర్చే కుట్రలు జరిగాయన్న ఆ పార్టీ ఆరోపణలను డీఎంకే తీవ్రంగా ఖండించింది. అసెంబ్లీ, పార్లమెంటులో ఎండీఎంకేకు ప్రాతినిధ్యం లభించేలా చేసిందే డీఎంకే అని అని సయ్యద్ హఫీజుల్లా అన్నారు. వంశపారంపర్య రాజకీయాలను డీఎండీకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఆ పార్టీ చీఫ్ వైకో కుమారుడు దురై వైకోకు పార్టీలో ఉన్నత స్థానం లభించడమే డీఎండీకే బలహీనపడటానికి దారితీసిందని పేర్కొన్నారు. డీఎంకే కూటమి నుంచి డీఎండీకే వైదొలిగినప్పటికీ ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే ఉంటామని చెప్పడం గమనార్హం.