ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పేల్చివేతతో దిగొచ్చిన ట్రంప్.. ఇక నుంచి ఇజ్రాయెల్ దాడి చేయదంటూ ప్రకటన !

ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పేల్చివేతతో దిగొచ్చిన ట్రంప్.. ఇక నుంచి ఇజ్రాయెల్ దాడి చేయదంటూ ప్రకటన !

ఇరాన్ ఆయిల్, గ్యాస్ నిల్వలపై దెబ్బకొట్టాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ షాకిచ్చిందనే చెప్పాలి. అమెరికా మిలిటరీ బేస్ లను లక్ష్యంగా చేసుకుని సూసైడ్ డ్రోన్స్ ప్రయోగించిన ఇరాన్.. ఖతార్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ రాస్ లఫాన్ రిఫైనరీపై మిస్సైళ్లతో దాడికి దిగింది. గ్యాస్ క్షేత్రం దెబ్బతిన్నట్లు ఖతార్ అధికారులు ప్రకటించారు.

ప్రపంచానికి ఐదు వంతుల గ్యాస్ సరఫరా చేసే రిఫైనరీపై ఇరాన్ గురువారం (మార్చి 19) తెల్లవారుజామున మిస్సైల్ అటాక్ తో ట్రంప్ దిగొచ్చారనే చెప్పాలి. ఇరాన్ అటాక్ తో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం మరింతగా పెరిగిపోతుందనే ఆందోళనతో.. ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ గ్యాస్ ఫెసిలీటలపై ముందస్తు దాడులు ఉండవని ప్రకటించారు. కానీ ఇరాన్ దాడి చేస్తే మాత్రం అంతకు రెట్టింపు దాడులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్. గ్యాస్ ఫీల్డ్స్ నష్టం చేసుకోకూడదనే విధంగా ట్రంప్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పై మొదట ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార చర్యగా ఖతార్, సౌదీ, అబుధాబీల గ్యాస్ క్షేత్రాలతో పాటు అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగింది. బుధవారం రాత్రి ఇరాన్ లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో కాస్త డ్యామేజ్ జరిగింది. 

ఈ వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్న అమెరికా.. వెంటనే దిగొచ్చి ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ హింసాత్మకంగా వ్యవహరించిందని అమెరికా చీఫ్ కమాండర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి అమెరికాకు ముందస్తుగా ఏమీ తెలియదని పేర్కొన్నారు. దీంతో ఇరాన్ అమాయక ఖతార్ పై దాడికి దిగినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఇక నుంచి గ్యాస్ ఫీల్డ్స్ పై దాడి చేయదని అమెరికా ప్రకటించింది. విలువైన గ్యాస్ క్షేత్రాలను ధ్వంసం చేసుకుంటే మరింత గ్యాస్ సంక్షోభం వస్తుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. 

ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పై ఇరాన్ దాడి తర్వాత ఇక నుంచి ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లోని విలువైన సౌత్ పార్ గ్యాస్ ఫీల్డ్స్ పై ఇజ్రాయెల్ దాడి చేయదని చెప్పారు. అమాయక ఖాతర్ లాంటి దేశాలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు.