IPL Illegal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 2026 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ పేరుపై వచ్చిన వివాదానికి కేరళ హైకోర్టు తెరదించింది. ఐపీఎల్ పేరును బీసీసీఐ అక్రమంగా వాడుకుంటుందని ఓ వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అశీఖ్ కరోత్ అనే ఓ సామాజిక కార్యకర్త ఐపీఎల్ పేరుపై పిల్ ఫైల్ చేశాడు. ‘ఇదేమీ జాతీయ టోర్నమెంట్ కాదు.. అలాంటప్పుడు ‘ఇండియన్’ అనే పేరు ఎలా ఉపయోగిస్తారు? బీసీసీఐ అక్రమంగా ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ అనే పేరును వాడుతుంది.. ఇది సమంజసం కాదని కోర్టు మెట్లెక్కాడు.
కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ ధర్మాసనం ఈ అంశంపై వాదనలు విన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే క్యాచ్ రిచ్ లీగ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది.. ఐపీఎల్ గురించి ఇప్పటికిప్పుడు తెలుసుకుని పిటిషన్ వేయడం సరైంది కాదు.. మీ వాదనకి సంబంధించి సరైన ఆధారాలు లేవు అంటూ ఆ పిటిషన్‌ను కేరళ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఐపీఎల్ 2026 ఆరంభానికి ఆర్సీబీ చిక్కుల్లో పడింది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. చిన్నస్వామి స్టేడియం బయట విక్టరీ పరేడ్ నిర్వహించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. పలువురు తీవ్ర గాయపడ్డారు. అనంతరం చిన్నస్వామి మైదానంలో మ్యాచ్‌లను కర్ణాటక ప్రభుత్వం నిర్వహించకుండా ఆపేసింది.
కాగా సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కర్ణాటక సర్కార్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అనుమతినిస్తూ మార్చి 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్సీబీ హోం గ్రౌండ్‌ను వేరే దగ్గరకి తరలించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఐపీఎల్ 2026కి ముందు నెలకొన్న వివాదాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడటంతో.. క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కాగా మార్చి 28వ తేదీన ఆర్సీబీ- వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
