పెంపుడు పిల్లి చనిపోయిందని.. హైదరాబాద్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

పెంపుడు పిల్లి చనిపోయిందని.. హైదరాబాద్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

ఈ రోజుల్లో నగరవాసులు ఎంత సున్నితమైపోతున్నారో కళ్లకు గట్టే ఉదాహరణ ఇది. ముఖ్యంగా యువత ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఎక్కడికి దారి తీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పెంపుడు జంతువు చనిపోయిందని.. పెంచీ పెద్ద చేసిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకవడం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు జంతువు మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బడంగ్‌పేట్ వెంకటాద్రి నివాస్‌కు చెందిన హిమబిందు (20), బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. 

గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లి ఇటీవల మరణించింది. ఈ క్రమంలో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన హిమబిందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లిపై అఫెక్షన్ పెట్టుకుంది కానీ.. ప్రాణాలు తీసుకునేంతలా అని తాము అనుకోలేదని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. పిల్లి కోసం పెంచిన తల్లిదండ్రులను ఒంటరి చేసి వెళ్లిపోయిందని గుండెలు బాదుకుంటున్నారు.

స్థానికుల సమాచారంతో మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిల్లి చనిపోయిందని చనిపోయిందా లేక మరేమైనా అంతర్గత వ్యవహారం ఉందా అన్న కోణంలో అనుమానస్పాద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.