మాఫియాను తలపిస్తున్న కాంగ్రెస్‌‌‌‌ పాలన : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌‌‌రావు

మాఫియాను తలపిస్తున్న కాంగ్రెస్‌‌‌‌ పాలన : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌‌‌రావు

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మాఫియాను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌‌‌‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా చండూరులో ఇటీవల జరిగిన గొడవలో గాయపడి నల్గొండలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో లా అండర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ కరువైందన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ లీడర్లు దాడులు చేస్తున్నా పోలీసులు నామమాత్రపు కేసులు పెడుతున్నారన్నారు.

రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై మరోసారి దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌‌‌‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి, పిల్లి రామరాజు, గోళి మధుసూదన్‌‌‌‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్ పాల్గొన్నారు.