ఉప్పల్లో నకిలీ డాక్టర్ అరెస్ట్

ఉప్పల్లో  నకిలీ డాక్టర్ అరెస్ట్

ఉప్పల్, వెలుగు: ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివి డాక్టర్​గా చలామణి అవుతున్న వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ బీరప్పగడ్డ శ్రీనగర్ కాలనీలో ‘అంజలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్న బానోతు శ్రీను డాక్టర్​గా ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండా మెడికల్ షాపు నిర్వహిస్తున్నారని తేలడంతో పలు మెడికల్ పరికరాలు, మందులు, పలు కిట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.