పంట నష్టం.. అప్పుల భారం.. తట్టుకోలేక రైతు ఆత్మహత్య

పంట నష్టం.. అప్పుల భారం.. తట్టుకోలేక రైతు ఆత్మహత్య

తొగుట (దుబ్బాక), వెలుగు: చేతికందిన పంట నీరు లేక ఎండిపోవడం, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాగోతంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మోహన్ రెడ్డి(40) తనకున్న భూమిలో వరి పంట సాగు చేస్తున్నాడు. ఇటీవల సాగు చేసిన పంటకు తీవ్ర నీటి కొరత ఏర్పడింది.

అప్పులు చేసి రెండు బోర్లు వేయించినా నీరు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. ఓవైపు పంట నష్టం, మరోవైపు అప్పుల భారం పెరగడంతో మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.