కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. హోటల్ నుండి హాస్పిటల్ వరకు అన్ని క్షణాల్లోనే !

 కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. హోటల్ నుండి హాస్పిటల్ వరకు అన్ని క్షణాల్లోనే !

ప్రభుత్వం దేశ ప్రజల కోసం కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డు లేదా జిరాక్స్  తీసుకెళ్లాల్సిన  పని లేకుండా, మీ మొబైల్ ద్వారానే మీ గుర్తింపును నిరూపించుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

 కొత్త ఆధార్ యాప్‌ ఫీచర్లు: మీరు హోటల్ లేదా విమానాశ్రయాల్లో ఆధార్ చూపించాల్సి వచ్చినప్పుడు, మీ పూర్తి వివరాలు కాకుండా వారికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేసే అవకాశం ఉంటుంది. హోటల్ చెక్-ఇన్  కోసం కేవలం QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా వెంటనే మీ ఐటెండిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

ALSO READ : గూగుల్ ఫోటోస్ కొత్త అప్‌డేట్: ఇక మాటలతోనే ఫోటో ఎడిటింగ్!

ఫోటో లేదా ఫింగర్ ప్రింట్ కాకుండా మీ ముఖం ద్వారా కూడా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు. మీ ఆధార్ వివరాలు ఎవరూ దొంగిలించకుండా మీరే ఫోన్ ద్వారా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకే ఫోన్‌లో ఈ యాప్ ద్వారా మీ కుటుంబికుల సంబంధించి ఐదుగురి ఆధార్ వివరాలను సేవ్ చేసుకోవచ్చు.

ఇతర ప్రయోజనాలు 
మొబైల్ నంబర్ అప్‌డేట్: ఇకపై చిన్న చిన్న మార్పుల కోసం లేదా మొబైల్ నంబర్ మార్చుకోవడానికి బ్యాంకులు, ఆధార్ సెంటర్లకు  వెళ్లాల్సిన అవసరం లేదు. యాప్ ద్వారానే ఇంటి దగ్గర ఉండి అప్‌డేట్ చేసుకోవచ్చు.

 మీ సమాచారాన్ని ఏ ఏజెన్సీలు స్టోర్  చేయలేవు. కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే మీ డేటా తీసుకుంటుంది. దీనివల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు.

ఆసుపత్రిలో చేరాలన్నా లేదా సినిమా టికెట్ బుక్ చేసేటప్పుడు మీ వయస్సు నిరూపించాలన్నా ఈ యాప్ ద్వారా ఈజీగా పని అయిపోతుంది. UIDAI రూపొందించిన ఈ యాప్ ద్వారా ఇకపై మనం పేపర్ వర్క్ లేకుండా డిజిటల్ ఆధార్ తో మన పనులను వేగంగా, సురక్షితంగా  చేసుకోవచ్చు.