The Rajasaab OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ప్ర‌భాస్‌ ‘ది రాజాసాబ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

The Rajasaab OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ప్ర‌భాస్‌ ‘ది రాజాసాబ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్డేట్ వచ్చింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మిక్సెడ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నెలరోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ షాక్ ఇచ్చింది.

ఈ మేరకు ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానునట్లు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అయితే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్కి ఇంకొంచెం టైం పట్టె అవకాశం కనిపిస్తోంది.

బాక్సాఫీస్ పరంగా చూస్తే, సినిమా విడుదలైన తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. కానీ నెగటివ్ రివ్యూల ప్రభావంతో ఆ తర్వాత రోజుల్లో వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో, మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లకు పైగా గ్రాస్, ఇండియాలో రూ.143.08 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అయితే, మేకర్స్ పెట్టిన భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతకు నష్టాలు తప్పలేదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఓవరాల్‌గా, ఈ సినిమా ద్వారా నిర్మాతకు రూ. 150 కోట్లకు పైగా నష్టం వచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అంచనాలే తప్ప, అధికారికంగా ధృవీకరించబడినవి కావు. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.