సౌతాఫ్రికాదే సిరీస్‌‌.. సౌతాఫ్రికాపై రెండో టీ20లో విక్టరీ

సౌతాఫ్రికాదే సిరీస్‌‌.. సౌతాఫ్రికాపై రెండో టీ20లో విక్టరీ

సెంచూరియన్‌‌‌‌: ఛేజింగ్‌‌‌‌లో క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (115) సెంచరీకి తోడు ర్యాన్‌‌ రికెల్టన్‌‌‌‌ (77 నాటౌట్‌‌‌‌) రాణించడంతో.. గురువారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలిచింది. 

ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌‌‌ ఓడిన విండీస్‌‌‌‌ 20 ఓవర్లలో 221/4 స్కోరు చేసింది. హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (75), రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ (57 నాటౌట్‌‌‌‌) రాణించారు.  కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికా 17.3 ఓవర్లలో 225/3 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్‌‌‌‌ మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (15) ఫెయిలైనా.. డికాక్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 162 రన్స్‌‌‌‌ జోడించారు. డికాక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 శనివారం జొహనెస్‌‌‌‌బర్గ్‌‌‌‌లో జరుగుతుంది.