కిటకిటలాడిన రామప్ప ఆలయం

కిటకిటలాడిన రామప్ప ఆలయం

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్​ భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని వెళ్లే క్రమంలో భక్తులు రామప్ప ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ  ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ విక్రమ్ మాన్ సింగ్ స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ వెంకటేశ్​రామప్ప చరిత్ర, శిల్పకళ నైపుణ్యం గురించి వివరించారు. డిజీవెంట టూరిస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉన్నారు.