తెలంగాణ దివాలా తీయడానికి కారణం కేసీఆరే : మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ దివాలా తీయడానికి కారణం కేసీఆరే : మహేశ్ కుమార్ గౌడ్
  • పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ 

యాదాద్రి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కారణంగా తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని పీసీపీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ విమర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మందనపల్లిలో 'వీబీజీ రామ్​ జీ' స్కీమ్​ను తొలగించి ఉపాధి హామీ స్కీమ్​ ను కొనసాగించాలని కోరుతూ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంపై వడ్డీతో కలుపుకొని రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని దివాలా తీయించిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్​హౌజ్‌లో  పడుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.  ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించే విధంగా కాంగ్రెస్​ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి మించి టికెట్లు ఇస్తామని తెలిపారు.  ఉపాధి హామీలో కేంద్రం నుంచి వందశాతం నిధులు వచ్చేదని, ఇప్పుడు అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్​జీతో రాష్ట్రంపై 40 శాతం భారం మోపిందని తెలిపారు. అసలే దివాళా తీసిన రాష్ట్రంపై ఈ భారం మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ బండ్రు శోభారాణి, ఉన్నారు.