Sharwanand: ఓటీటీలోకి 'నారీ నారీ నడుమ మురారి'.. శర్వానంద్ ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Sharwanand: ఓటీటీలోకి 'నారీ నారీ నడుమ మురారి'.. శర్వానంద్ ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఈ ఏడాది సంక్రాంతి రేసులో సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ మార్క్ టైమింగ్, రామ్ అబ్బరాజు మేకింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ద సినిమాలతో పోటీపడి మరీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.  ఇప్పుడు  ఈ మూవీ డిజిటల్ తెరపై సందడి చేసేందుకు రెడీ అయింది.

థియేటర్లలో రికార్డులు..

ఈ సంక్రాంతి సీజన్ నిజంగానే టఫ్ ఫైట్‌గా నిలిచింది. ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', రవితేజ ' భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి  ' అనగనగా ఒక రాజు'   'బేబీ గర్ల్' వంటి భారీ చిత్రాలు బరిలో ఉన్నాయి. అయినప్పటికీ శర్వానంద్ తనదైన శైలిలో నిలబడ్డారు. విడుదలైన 16 రోజుల్లో సుమారు రూ.32.55 కోట్లు వసూలు చేసింది. : కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం స్థిరమైన వసూళ్లను సాధించింది.

శర్వానంద్ కామెంట్స్

జనవరి 23న నిర్వహించిన సంక్రాంతి విన్నర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ లో శర్వానంద్ ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. మా సినిమా ఇక్కడితో ఆగిపోదు, థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.. మరో నాలుగు వారాల పాటు థియేటర్లలో సందడి చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆయన అన్న రెండు వారాలకే సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఓటీటీ లో ఎప్పుడు? ఎక్కడ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.  ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. నిర్మాత అనిల్ సుంకర పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ALSO READ : RX 100’ డైరెక్టర్ మూవీలో కొత్త హీరోయిన్.. ‘మంగ’గా మెస్మరైజ్ చేస్తోన్న 20 ఏళ్ల బ్యూటీ!

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. శర్వానంద్ పక్కన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా, వారి ముగ్గురి మధ్య కెమిస్ట్రీ,  కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం. భార్యాభర్తల గొడవలు, మధ్యలో నలిగిపోయే హీరో పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేక ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో "నారీ నారీ నడుమ మురారి"ని చూసి రిలాక్స్ అవ్వండి!