IND vs NZ 4th T20I: ఫుట్ వర్క్ లేకుండా వికెట్లు వదిలేసి నిలబడతావా.. శాంసన్ ఔటైన తీరుపై గవాస్కర్ విమర్శలు

IND vs NZ 4th T20I: ఫుట్ వర్క్ లేకుండా వికెట్లు వదిలేసి నిలబడతావా.. శాంసన్ ఔటైన తీరుపై గవాస్కర్ విమర్శలు

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  తనకు ఇష్టమైన ఓపెనింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పగించినప్పటికీ శాంసన్ తాను ఆడిన తొలి 3 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 16 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. తిలక్ వర్మ గాయం కారణంగా ప్రతి మ్యాచ్ లో ఆడే  అవకాశం వచ్చినా ఉపయోగిచుకోవడంలో విఫలమయ్యాడు. బుధవారం (జనవరి 28) కివీస్ తో జరిగిన నాలుగో టీ20లో 24 పరుగులు చేయి మరోసారి నిరాశపరిచాడు. 

వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శాంసన్ ఆరంభంలో మంచిగా ఆడినప్పటికే తన ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ గా మలచడంలో విఫలమయ్యాడు. 24 పరుగుల వద్ద కివీస్ కెప్టెన్ సాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. శాంసన్ ఔటైన తీరుపై టీమిండియా దిగ్గజం  సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. కామెంట్రీ చేస్తూ గవాస్కర్ ఇలా అన్నాడు.. " శాంసన్ కు అసలు ఫుట్ వర్క్ లేదు. వికెట్లు వదిలేసి అలా నిలబడ్డాడు. రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్ ఆది ఉండాల్సింది. లెగ్ స్టంప్ కు దూరంగా జరిగి మూడు స్టంప్స్ వదిలేస్తే ఏ బౌలర్ అయినా బౌల్డ్ చేయకుండా ఎలా ఉంటాడు. శాంసన్ ఔటైన విధానం చిరాకు తెప్పిస్తుంది". అని శాంసన్ పై గవాస్కర్  ఫైరయ్యాడు. 

50 పరుగులతో టీమిండియా ఓటమి:
 
న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోయింది. బుధవారం (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. 216 పరుగుల భారీ ఛేజింగ్ లో టీమిండియా విజయం కోసం దూబే (23 బంతుల్లో 65: 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అసాధారణంగా పోరాడినా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి సిరీస్ లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.  

వరల్డ్ కప్ లో ఓపెనర్ గా శాంసన్ కు చెక్: 

న్యూజిలాండ్ తో సిరీస్ ముందువరకు వరల్డ్ కప్ కు ఓపెనర్లు కన్ఫర్మ్ అయ్యారు. అభిషేక్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ దిగడం ఖాయమనుకున్నారు. అయితే ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ చూస్తే శాంసన్ వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. శాంసన్ పేలవ ఫామ్ ఇందుకు కారణం. న్యూజిలాండ్ తో ఇప్పటివరకు జరిగిన నాలుగు టీ20 మ్యాచ్ ల్లో  శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్ ల్లో కలిపి 40 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

►ALSO READ | Cricket Australia: స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్.. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

మరోవైపు ఇషాన్ కిషాన్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. కిషాన్ దూకుడు చూస్తుంటే వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో స్థానం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ జట్టులోకి వస్తే కిషన్ లేదా శాంసన్ లలో ఒకరు తప్పుకోవాలి. దీని ప్రకారం ఫామ్ లో ఉన్న కిషాన్ ను అభిషేక్ శర్మతో ఓపెనింగ్ కు పంపొచ్చు.