జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలను ఖండించిన హైడ్రా

జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలను ఖండించిన హైడ్రా

హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలను హైడ్రా ఖండించింది. మూసీ పక్కన నిర్మిస్తున్న ఆదిత్య బిల్డర్స్ ప్రాజెక్టు విషయంలో హైకోర్టు అనుమతులు ఉన్నప్పటికీ మరోసారి వాస్తవాలు నిర్ధారించుకోవాలనే ఉద్దేశంతోనే తహశీల్దార్‌కు లేఖ రాసినట్టు స్పష్టం చేసింది. 

శాటిలైట్ చిత్రాల్లో నది గర్భంలోకి వెళ్లి ప్రహరీ నిర్మిస్తున్నట్టు అనుమానం రావడంతోనే రెవెన్యూ అధికారులను వివరణ కోరామని తెలిపింది హైడ్రా. ఆదిత్య బిల్డర్స్‎కి నిర్మాణ అనుమతులు గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారని హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఒకసారి వివరించామని, అయినప్పటికీ మరోసారి స్పష్టత ఇస్తున్నట్టు పేర్కొంది హైడ్రా.

అంతకుముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్‎పై కవిత సీరయస్ అయిన విషయం తెలిసిందే. తన ధర్నాపై హైడ్రా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ రంగనాథ్‎ను కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.