హైదరాబాద్లో విషాద ఘటన.. ఎంత ఘోరమో చూడండి.. పాపం ఈ కుటుంబం !

హైదరాబాద్లో విషాద ఘటన.. ఎంత ఘోరమో చూడండి.. పాపం ఈ కుటుంబం !

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకుపోవడంతో బైక్ పై ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యా-కుమారుడికి గాయాలయ్యాయి. రాంనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్ (35), అతని భార్య మర్రి శ్రావణి (33), కుమారుడు సహస్రార్ (12) ముగ్గురు బైక్‌పై రాంనగర్ నుంచి మేడిపల్లిలోని బంధువుల ఇంటికి బైక్పై వెళ్తున్నారు.

ఈ క్రమంలో మేడిపల్లి పీఎస్ పరిధిలోని డీకాథ్లాన్ (Decathlon) సమీపానికి రాగానే వెనుక నుండి అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణి తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితిలో ఉండగా, కుమారుడు సహస్రార్‌కు కూడా గాయాలు అయ్యాయి. 

ఢీ కొట్టిన అనంతరం కారు బైక్‌ను కొద్ది దూరం వరకు ఈడ్చుకుపోయినట్లు సీసీటీవీ లో రికార్డు అయింది. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సహస్రార్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రశాంత్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో కారులో యజమాని, డ్రైవర్ ఒక్కడే అయిన రామయ్య ఒక్కడే ఉన్నాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.