హైదరాబాద్ గోల్కొండలో దారుణం జరిగింది. 14 నెలల పసికందును చంపింది ఓ కసాయి తల్లి. దిండుతో పసికందుకు ఊపిరాడకుండా చేసి శిశువును చంపేసింది తల్లి. ఆదివారం ( మార్చి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గోల్కొండకు చెందిన మౌసియా బేగంకు 14 నెలల బాబు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన మౌసియా బేగం తన బిడ్డను చంపేసింది.
దిండుతో ఊపిరాడకుండా చేసి శిశువును చంపేసింది మౌసియా బేగం. ఘటన జరిగిన వెంటనే శిశువు తండ్రి, తాత శిశువును ఇండో యూఎస్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు డాక్టర్లు. ఘటన జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది మౌసియా బేగం.
►ALSO READ | హైదరాబాద్ ఉప్పల్ లో కానిస్టేబుల్ దారుణ హత్య...స్నేహితుడే కత్తితో పొడిచి...
కుటుంబ కలహాలే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు మానవ సంబంధాలపై ఎంత ప్రభావం చూపుతాయి అన్నది ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.
