హైదరాబాద్ ఉప్పల్ లో కానిస్టేబుల్ దారుణ హత్య...స్నేహితుడే కత్తితో పొడిచి...

హైదరాబాద్ ఉప్పల్ లో కానిస్టేబుల్ దారుణ హత్య...స్నేహితుడే కత్తితో పొడిచి...

హైదరాబాద్ ఉప్పల్ లో దారుణం జరిగింది.. కానిస్టేబుల్ ను స్నేహితుడే కత్తితో కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం ( మార్చి 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్కానగర్ ఆదర్శ్ నగర్ లో కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. చెంగిచర్ల ఆర్టీసీ కాలనిలో ఉంటున్న సుధీర్ రెడ్డిని తన స్నేహితుడైన సంతోష్ కత్తితో కడుపులో పొడిచి హత్య చేశాడు.

సుధీర్ రెడ్డిని చిలకనగర్ కు పిలిపించిన సంతోష్ కత్తితో కడుపులో, మెడపై విచక్షణారహితంగా పొడిచి పరారైనట్లు తెలిపారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుధీర్ రెడ్డి హైదరాబాద్ సిటీ వింగ్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

►ALSO READ | హైదరాబాద్లో విషాద ఘటన.. ఎంత ఘోరమో చూడండి.. పాపం ఈ కుటుంబం !