బారామతి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్.. అజిత్ పవార్ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారంటే..?

బారామతి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్.. అజిత్ పవార్ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారంటే..?

ముంబై: మహారాష్ట్రలోని బారామతి, రాహురి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ రెండు స్థానాలకు 2026, ఏప్రిల్ 23 ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం (మార్చి 15) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2026, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.

హెలికాప్టర్ ప్రమాదంలో అజిత్ పవార్ మృతి:

2026, జనవరి 28న దివంగత నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో బారామతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్సీపీ కంచుకోటైన బారామతి నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమయ్యారు. 

►ALSO READ | పెళ్లి పీటల పైనే ఏంటీ రోత.. పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ అని.. ఒకటుంటుందని మర్చిపోయారేమో..!

అజిత్ పవార్ గౌరవార్థం ఈ స్థానం నుంచి ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఎన్నిక ఏకగ్రీవం చేసే అవకాశం ఉన్నట్లు మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‏లో ప్రచారం జరుగుతోంది. సునేత్రా పవార్ ఇప్పటికే రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆరు నెలల్లో ఆమె శాసన మండలి లేదా శాసన సభ సభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంది. 

గుండె పోటుతో ఎమ్మెల్యే ఆకస్మిక మరణం: 

బారామతితో పాటు రాహురి నియోజకవర్గానికి కూడా బై పోల్ జరగనుంది. 2025 అక్టోబర్‌లో బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కార్దిలే గుండెపోటుతో మరణించడంతో రాహురి (అహల్యానగర్ జిల్లా) అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. బారామతి మాదిరిగా ఏకగ్రీవం కాకుండా రాహురి ఉప ఎన్నికలో తీవ్ర పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది.