పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు !

పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు !

పెద్ది డైరెక్టర్ బుచ్చి బాబు సాన.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్ల తన విధేయతను చాటుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కి మరీ బుచ్చిబాబు తన విశ్వాసం, అభిమానం చాటుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుచ్చి బాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చి పవన్ కల్యాణ్ పలకరించారు. బుచ్చి బాబు తన మొదటి సినిమాలో హీరోగా వైష్ణవ్ తేజ్ను ఎంచుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో ఈ మెగా హీరోకి మంచి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రాంచరణ్తో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాను ‘పెద్ది’గా తెరకెక్కిస్తున్నాడు.

రాంచరణ్కు తన గురువు సుకుమార్ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయిన ‘రంగ స్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే హీరోతో ‘పెద్ది’ సినిమాతో అంతకు మించిన హిట్ కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని బుచ్చి బాబు ఉవ్విళ్లూరుతున్నాడు. బుచ్చి బాబు సాన మొదటి నుంచి వినయ విధేయ రామ తరహాలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు. బుచ్చి బాబును ఏ ఫంక్షన్లో చూసినా, ఏ ఈవెంట్లో చూసినా అదే తరహా బాడీ లాంగ్వేజ్తో ఉంటాడు. బుచ్చి బాబు బాడీ లాంగ్వేజ్పై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. సోషల్ మీడియా నరం లేని నాలుక లాంటిదని ఇవేమీ పట్టించుకోకుండా బుచ్చి బాబు తన పని తాను చేసుకుంటూ ముందుకెళుతున్నాడు. 

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.  బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దీనిని  విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఇక పెద్ది లేటెస్ట్ అప్డేట్ విషయానికొస్తే.. మార్చి 27న రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు డబుల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ‘పెద్ది’ సినిమా గురించి కాగా,  మరొకటి సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ కావడం విశేషం. ‘పెద్ది’ నుంచి చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్ డే కానుకగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబోతుందని సమాచారం.

►ALSO READ | Suyodhana Teaser: సస్పెన్స్‌తో ఆకట్టుకున్న ‘సుయోధన’ టీజర్.. మిస్టరీ ఛేదించే పాత్రలో ప్రియదర్శి

‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాబోతున్న ఈ చిత్రంపై హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలకొన్నాయి. ఆ అంచనాలను రీచ్ అయ్యేలా చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మూవీ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీటెయిల్స్ రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 17వ సినిమా.