ఇందిరమ్మ ఇండ్ల  పెండింగ్ బిల్లులు క్లియర్

ఇందిరమ్మ ఇండ్ల  పెండింగ్ బిల్లులు క్లియర్
  • 2,764 మంది లబ్ధిదారులకు రూ.28.50 కోట్లు చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను అధికారులు క్లియరెన్స్ చేశారు. వారం రోజుల్లో 2,764  మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ.28.50 కోట్ల పెండింగ్ బిల్లులను పూర్తి చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.

క్లియర్ చేసిన బిల్లుల్లో ఎల్-3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి రూ.12.06 కోట్ల బిల్లులు విడుదలైనప్పటికీ.. వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిలైన 653 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు వివరించారు. వీటితోపాటు పలు అభ్యంతరాలు, పరిశీలన నిమిత్తం పెండింగ్ లో ఉన్న మరో 911 మంది లబ్ధిదారులకు చెందిన రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.