క్రికెట్ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ లో ఊహించని నిర్ణయం తీసుకొని ఆశ్చర్యపరిచింది. అనుభవం లేని ఒక యువ ప్లేయర్ కు ఏకంగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఎంపిక చేసింది. 28 ఏళ్ల బౌలింగ్ ఆల్ రౌండర్ సోఫీ మోలినెక్స్ ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కొత్త ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని ప్రకటించింది. అలిస్సా హీలీ స్థానంలో మోలినెక్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనుంది. భారత మహిళల జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ నుంచి మోలినెక్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుంది. తహ్లియా మెక్‌గ్రాత్, ఆల్ రౌండర్ ఆష్లీ గార్డ్నర్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మోలినెక్స్ సారధ్య బాధ్యతలు అప్పగించడం విశేషం.
ఫిబ్రవరి, మార్చి నెలలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో భాగంగా ఇరు జట్లు మూడు ఫార్మాట్ లు డతాయి. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు టీ20 సిరీస్.. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు వన్డే సిరీస్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మార్చి 6న జరుగుతుంది. ఈ టూర్ లో మోలినెక్స్ కేవలం టీ20 జట్టుకు మాత్రమే కెప్టెన్సీ చేయనుంది. అలిస్సా హీలీ వన్డే, టెస్ట్ జట్టును నడిపిస్తుంది. హీలీ అంతర్జాతీయ క్రికెట్ లో ఇదే చివరి సిరీస్. ఈ సిరీస్ తర్వాత హీలీ నుంచి టెస్ట్, వన్డే, టీ20 పగ్గాలను మోలినెక్స్ చేపడుతుంది.
►ALSO READ | IND vs NZ 4th T20I: ప్లేయింగ్ 11లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు.. మ్యాచ్ తర్వాత సూర్య సమాధానమిదే!
ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కొత్త ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత సోఫీ మోలినెక్స్ సంతోషం వ్యక్తం చేశారు. "ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంపికవడం నిజంగా గౌరవం. నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ ఆస్ట్రేలియా మహిళా జట్టుపై జట్టుపై అలిస్సా ఎంతగానో ప్రభావం చూపించింది. మాకు చాలా పటిష్టమైన జట్టు ఉంది. జట్టులో ఎంతోమందికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కలిసి పని చేసి జట్టును ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను".మోలినెక్స్ చెప్పుకొచ్చారు.
ఆస్ట్రేలియా కెప్టెన్సీకి హీలీ గుడ్ బై:
ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరైన అలిస్సా హీలీ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం (జనవరి 13) హీలీ తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మార్చిలో టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్ తన కెరీర్ లో చివరిదని ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ తెలిపింది. ఈ టూర్ లో భాగంగా పెర్త్‌లో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో పాటు ఒక టెస్ట్ మ్యాచ్ కు హీలీ చివరిసారిగా నాయకత్వం వహిస్తుంది. అయితే టీ20 సిరీస్ కు మాత్రం ఈ ఆసీస్ దిగ్గజం అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఆమె 2026 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆడదు. కాబట్టి టీ20 సిరీస్ ఆడినా పెద్ద ప్రయోజనం ఉండదు.
Sophie Molineux is beginning her exciting next chapter as captain of the Australian Women's cricket team 🙌
— ICC (@ICC) January 29, 2026
More 👉 https://t.co/1vT9GUJOqv pic.twitter.com/WRzfXDUjq3
