IND vs NZ 4th T20I: ప్లేయింగ్ 11లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు.. మ్యాచ్ తర్వాత సూర్య సమాధానమిదే!

IND vs NZ 4th T20I: ప్లేయింగ్ 11లో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు.. మ్యాచ్ తర్వాత సూర్య సమాధానమిదే!

న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా నాలుగో టీ20లో ఓడిపోయింది. తొలి మూడు టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు నాలుగో టీ20లో కివీస్ ఓటమిని రుచి చూపించింది. ఈ మ్యాచ్ లో ఇండియా చేసిన ఒక ప్రయోగమే ఓటమికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఇషాన్ కిషాన్ గాయం కారణంగా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కు అవకాశం ఇవ్వకుండా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు తుది జట్టులో చోటు కల్పించారు. ఒక బ్యాటర్ తక్కువ కావడంతో ఇండియా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టు కూర్పుపై టీమిండియా కెప్టెన్ సూర్య మ్యాచ్ తర్వాత వివరించాడు.             

నాలుగో టీ20 ముగిసిన తర్వాత సూర్య మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. "మేము ఈ మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగానే ఆరుగురు బ్యాటర్లను ఆడించాలని భావించాం. మేము ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉంటే జట్టు ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. మాకు మేము సవాలు చేసుకోవాలనుకున్నాం. ఉదాహరణకు మేము 200 లేదా 180 పరుగులను ఛేజ్ చేస్తున్నపుడు ఇద్దరూ లేదా ముగ్గురు బ్యాటర్లు ఔటైనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. మ్యాచ్ పై మేము సంతృప్తిగానే ఉన్నాం. ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరినీ మేము ఆడించాలనుకున్నాము. దూబేతో పాటు ఎవరైనా క్రీజ్ లో సెట్ అయ్యి ఉంటే ఫలితం మరోలా ఉండేది". అని సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | ICC Cricket: ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా: నేడు (జనవరి 29) మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

50 పరుగులతో టీమిండియా ఓటమి:
 
న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోయింది. బుధవారం (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. 216 పరుగుల భారీ ఛేజింగ్ లో టీమిండియా విజయం కోసం దూబే (23 బంతుల్లో 65: 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అసాధారణంగా పోరాడినా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి సిరీస్ లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.