ఇండియా, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి దాదాపు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. వరల్డ్ కప్ కు సన్నాహకంగా ప్రపంచ క్రికెట్ దేశాలు ద్వైపాక్షిక సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా గురువారం (జనవరి 29) ఒక్క రోజే మూడు అంతర్జాతీయ మ్యాచ్ లు ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి సై అంటున్నాయి. బుధవారం (జనవరి 28) ఇండియా, న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్ చూసి ఎంజాయ్ చేరిన ఫ్యాన్స్ కు నేడు (జనవరి 29) ట్రిపుల్ కిక్ దక్కనుంది.
పాకిస్థాన్, ఆస్ట్రేలియా తొలి టీ20:
పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ గురువారం (జనవరి 29) జరగనుంది. ఈ మ్యాచ్ కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. ఆస్ట్రేలియా జట్టును మిచెల్ మార్ష్ లీడ్ చేయనున్నాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా నడిపించనున్నాడు. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది.
లైవ్ స్ట్రీమింగ్. లైవ్ టెలికాస్టింగ్ ఎందులో చూడాలంటే..?
భారత కాలమాన ప్రకారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్ బ్రౌజర్‌లలోని సోనీ లివ్ యాప్ లో చూడొచ్చు.
వెస్టిండీస్, సౌతాఫ్రికా రెండో టీ20:
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య గురువారం (జనవరి 29) రెండో టీ20 జరగనుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.
►ALSO READ | T20 World Cup 2026: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు.. ఇండియా తర్వాత నేపాల్ మ్యాచ్‌లకు నెక్స్ట్ లెవల్ క్రేజ్
తొలి టీ20లో సఫారీలదే విజయం:
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ తొలుత 20 ఓవర్లలో 173/7 స్కోరు చేసింది. అనంతరం కెప్టెన్ మార్‌క్రమ్ (86) ముందుండి నడిపించడంతో ప్రోటీస్ టీమ్17.5 ఓవర్లలోనే 176/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
ఐర్లాండ్ తో యూఏఈ తొలి టీ20:
రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఐర్లాండ్, యూఏఈ జట్ల మధ్య గురువారం (జనవరి 29) తొలి టీ20 జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు లైవ్ టెలికాస్టింగ్ లేదు. లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఫ్యాన్ కోడ్ యాప్, సోనీ లివ్ లో లైవ్ చూడొచ్చు.
