టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించినట్లు పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో ఆయన చనిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన బయట ఎక్కడ కనిపించకపోవడం, మీడియాకు దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణ వార్తలను ఇజ్రాయెల్ పీఎంవో ఖండించింది.
నెతన్యాహు మరణించినట్లు వస్తోన్న వార్తలు ఫేక్ అని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వివరణ ఇచ్చింది. 2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇరాన్ ప్రతీ దాడులు చేసింది. ఈ దాడుల్లోనే నెతన్యాహు మరణించినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
►ALSO READ | కిమ్ దూకుడు.. న్యూక్లియర్ కెపాబుల్ రాకెట్ లాంచర్స్ ప్రయోగించిన నార్త్ కొరియా
కానీ అవన్నీ వట్టి పుకార్లేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ సంచలన ప్రకటన చేసింది. ఒక వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బతికే ఉంటే వెంటాడి మరీ చంపుతామని వార్నింగ్ ఇచ్చింది. ఆ బాలల హంతకున్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది.
