కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాశీబుగ్గ, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు వారిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్​ సిటీలోని 15,16, 17 డివిజన్ల పరిధిలోని మహిళా సమైక్య గ్రూపు సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రోగ్రామ్​కు ఎమ్మెల్యే రేవూరి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్​ హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పరకాల మహిళా డెయిరీని మహిళలపై పూర్తి నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మహిళా భాగస్వామ్యం కావాలని కోరారు.