ఫ్రాన్స్లో విమానం క్రాష్.. 11 మంది మృతి

ఫ్రాన్స్లో విమానం క్రాష్.. 11 మంది మృతి

 

  • స్కై డైవింగ్​ కోసం వెళ్లి మృత్యువాత
  • గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం


పారిస్: ఫ్రాన్స్ లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. స్కైడైవింగ్ స్టూడెంట్ల ప్రాక్టీస్ కోసం గాల్లోకి ఎగిరిన విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. టాంబ్లైన్ సిటీలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో పైలట్ సహా విమానంలోని మొత్తం పదకొండు మంది దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టాంబ్లైన్ సిటీలోని ఓ పారాచూటింగ్ ట్రైనింగ్ సెంటర్ కు చెందిన ఐదుగురు స్టూడెంట్లు, ఐదుగురు శిక్షకులను తీసుకుని ఉదయం 11 గంటలకు విమానం బయలుదేరింది. అయితే, గాల్లోకి లేచిన తర్వాత కాసేపటికే విమానం కూలిపోయింది.

పైలట్ తో పాటు స్కైడైవర్లు అందరూ మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రమాదం ప్రమాదం జరిగిన ‘రూ సాల్వడార్ అలెండే’ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, సహాయక చర్యలు చేపట్టారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు ఆ ప్రాంతానికి రావద్దని, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని పోలీసులు కోరారు.