దశాబ్దాల తర్వాత యూరప్లో తొలి సంపూర్ణ సూర్య గ్రహణం పగటిని రాత్రిగా మార్చింది. ఐస్‌లాండ్ నుంచి స్పెయిన్ వరకు, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. దశాబ్దాల తర్వాత యూరప్లో సంభవించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం బుధవారం ఖండమంతటా కనిపించింది. కొండలపైన, సముద్ర తీరాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోని ప్రజలు గుంపులు గుంపులుగా వీక్షిస్తూ పలు దేశాల్లో చీకటిగా మారిన పగటి పూటను చూశారు.
📽️WATCH | Total Solar Eclipse witnessed in Spain pic.twitter.com/NbfYqHbM8C
— The Tatva (@thetatvaindia) August 13, 2026
భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడం అనేది యాదృచ్ఛిక సంఘటన. సంపూర్ణ సూర్యగ్రహణం అని పిలువబడే ఈ క్షణిక ఖగోళ ఘటన అరుదుగా జరుగుతుంటుంది. సూర్యుడు పొగమంచుతో కమ్మేసిన నల్లటి పళ్ళెంలా కనిపించాడు. గడచిన 27 సంవత్సరాలలో ఐరోపాలో సంభవించిన మొదటి సంపూర్ణ గ్రహణం ఇదే కావడం విశేషం.
Absolutely insane solar eclipse, I took this video a couple minutes ago from Spain! pic.twitter.com/Iz9X2GCFtt
— Bray Falls (@astrofalls) August 12, 2026
స్పెయిన్లో సూర్య గ్రహణం స్పష్టంగా కనిపించింది. మాడ్రిడ్‌కు ఉత్తరాన ఉన్న గ్రామీణ జిల్లా బుయిట్రాగో డి లోజోయాలో, రాత్రి 8:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) తర్వాత, ఆకాశం మసకబారడం, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుని అంచు చుట్టూ ప్రకాశించే సూర్యకాంతి బిందువులైన బెయిలీస్ బీడ్స్ దిగంతంపై మెరవడం చూసి చాలా మంది చప్పట్లు కొట్టి, కేరింతలు కొట్టారు.అయితే.. ఆ దృశ్యం కేవలం నిమిషం మాత్రమే కనిపించింది.
Breathtaking solar eclipse over sunflower fields in Castrojeriz, Spain.
— The Figen (@TheFigen_) August 12, 2026
Video by Nahel Belgherze pic.twitter.com/m1bBA2Osz9
స్పెయిన్‌లో, ఉత్తర స్పెయిన్, బలేరిక్ దీవుల మీదుగా గ్రహణం ప్రయాణించే మార్గంలోని గ్రామీణ ప్రాంతాలకు 60 లక్షల వరకు సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అధికారుల అంచనాలకు మించి సందర్శకులు రావడంతో ఈ గ్రామీణ ప్రాంతాలు జనాలతో కిక్కిరిశాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐబీరియన్ ద్వీపకల్పం చివరిసారిగా 1912లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసింది. ఆగస్టు 2, 2027న మరొకటి రానుంది.
Once in a lifetime Solar Eclipse 2026 🌗#Spain pic.twitter.com/vei6R5qpyG
— Manan Trivedi (@itsurbunny7) August 13, 2026
