రైల్వేలో 4 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ : టెక్నికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు అద్భుత అవకాశం

రైల్వేలో 4 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ : టెక్నికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు అద్భుత అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్​బీ) జూనియర్ ఇంజినీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) పోస్టుల భర్తీకి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 4,098 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు : జూనియర్ ఇంజినీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ)

మొత్తం ఖాళీలు: 4098. 

ఎలిజిబిలిటీ
జూనియర్ ఇంజినీర్ (జేఈ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్): సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/ టెక్నికల్ అర్హత కలిగి ఉండాలి. 
కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ): కెమిస్ట్రీ/ మెటలార్జీ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు  14.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రెండోదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rrbapply.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్​బీ) జూనియర్ ఇంజినీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష  రెండు దశలుగా ఉంటుంది 
మొదటి దశ పరీక్ష (సీబీటీ–1): ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకోరు. మొత్తం100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు (0.33) మార్కులు కోత విధిస్తారు.

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో ఇస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి15 ప్రశ్నలు15 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు. 

రెండో దశ పరీక్ష (సీబీటీ–2)
సీబీటీ–1లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే సీబీటీ–2కి అనుమతిస్తారు. తుది మెరిట్ జాబితా, ఎంపిక పూర్తిగా సీబీటీ–2లో వచ్చే మార్కుల ఆధారంగానే జరుగుతుంది. మొత్తం150  ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు (0.33) మార్కులు కోత విధిస్తారు.

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ (10వ తరగతి స్థాయి) నుంచి 15 ప్రశ్నలు 15 మార్కులకు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 10 ప్రశ్నలు10 మార్కులకు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు, టెక్నికల్ ఎబిలిటీస్ (అభ్యర్థి చదివిన బ్రాంచ్/ ఇంజినీరింగ్ సబ్జెక్ట్) నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. 

క్వాలిఫైయింగ్ మార్కులు: సీబీటీ–1, సీబీటీ–2 పరీక్షల్లో అర్హత సాధించాలంటే జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 40 శాతం, ఓబీసీకి 30 శాతం, ఎస్సీకి 30 శాతం, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 25 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.