హార్మూజ్ మొత్తం మా కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోనే..యూఎస్ నేవీ దిగ్బంధం ‘ఉక్కు గోడ’.. ఇరాన్ ఏమీ చేయలేదు: ట్రంప్

హార్మూజ్ మొత్తం మా కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోనే..యూఎస్ నేవీ దిగ్బంధం ‘ఉక్కు గోడ’.. ఇరాన్  ఏమీ చేయలేదు: ట్రంప్

వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి మొత్తం తమ నియంత్రణలోకి వచ్చిందని, దానిని అలాగే కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంచుకుంటామని భావిస్తున్నానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా నావికాదళ దిగ్బంధం విజయవంతమైందని ప్రశంసించారు. దీనిని అందరూ ‘ఉక్కు గోడ(వాల్ ఆఫ్ స్టీల్)’ అని కొనియాడుతున్నారని, ఇరాన్ ఏమీ చేయలేదన్నారు. బుధవారం తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ మేరకు పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్‌‌‌‌‌‌‌‌కు ఇక నావికాదళం, వైమానిక దళం లేవు. వారి సైనికులకు జీతాలు కూడా అందడం లేదు. ఐఆర్జీసీ పూర్తిగా దెబ్బతిని పారిపోతోంది. ఇరాన్ ఇకపై పశ్చిమాసియాలో ఇతర దేశాలను బెదిరించలేదు. అల్లాకు స్తోత్రం!” అంటూ ఆయన తన పోస్టును ముగించారు. 

కాగా, అమెరికాలో మిడ్ టర్మ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, హార్మూజ్ మూసివేత అమెరికన్ ఓటర్లకు ధరలను పెంచేలా చేసిందని, ఇది ట్రంప్‌‌‌‌‌‌‌‌కు రాజకీయ తలనొప్పిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఆదివారం ‘యాక్సియోస్’ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌‌‌‌‌‌‌‌తో తక్కువ స్థాయి చర్చలు మాత్రమే జరుపుతున్నామని చెప్పారు. ‘‘ఇరాన్‌‌‌‌‌‌‌‌లో విపరీతమైన ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద అసలు డబ్బు లేదనే వాస్తవాన్ని మేం గమనిస్తున్నాం. సమస్య సర్దుబాటు అవుతుంది. ఇది చెస్ ఆట లాంటిది” అని ఆయన  అభివర్ణించారు.