త్వరలో ‘జంతర్ మంతర్ సీజన్ 2’ ..సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ప్రకటన

త్వరలో ‘జంతర్ మంతర్ సీజన్ 2’ ..సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ప్రకటన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే ‘జంతర్ మంతర్ సీజన్ 2’ ప్రారంభమవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జంతర్-మంతర్ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని చాలామంది ఇన్‌‌‌‌స్టాలో అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఏమిటంటే.. చాలా తొందర్లోనే అది ప్రారంభం కాబోతోంది’ అని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో దీప్కే ప్రకటనను స్వాగతించారు. 

బుధవారం ఢిల్లీలో సీజేపీ వాలంటీర్ల భేటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ  నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎవరూ తమకు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాలేదని దీప్కే తెలిపారు. పైస్థాయి నుంచి ఒత్తిడి ఉందని అందరూ చెప్తున్నారని.. ఎంతో కష్టపడి చివరకు ఓ హాల్ తీసుకుంటే, ఆ హాల్ యజమానుల్ని కూడా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.