ఆగస్టు 13న శ్రావణమాసం స్టార్ట్ కావటంతో ప్రజలు నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ చూడని విధంగా మళ్లీ రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో రిటైల్ ఆభరణాలు కొనుక్కోవాలనుకునే తెలుగు ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. అయితే షాపింగ్ చేయటానికి ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి.
ఆగస్టు 13న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.27 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 513గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 220గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 13, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.
