ఇవాల్టి ( ఆగస్టు13)నుంచి శ్రావణ మాసం : నెలంతా బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలు

ఇవాల్టి ( ఆగస్టు13)నుంచి శ్రావణ మాసం : నెలంతా బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాలు

ఆషాఢం వెళ్లిపోయింది.. ఆగస్టు 13 గురువారం  నుంచి శ్రావణం మొదలైంది.  దీంతో తెలుగు రాష్ట్రాల్లో  పెళ్లి బాజాలు మోగనున్నాయి.   నెల రోజుల పాటు ఆషాఢంతో పాటు మంచి రోజులు లేకపోవడంతో ఆగిన పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు మంగళవారంనుంచి షురూ అయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేల జంటలు ఏకం కానున్నాయి. శ్రావణంలో  బ్రహ్మాండమైన పెళ్లి ముహూర్తాల గురించి తెలుసుకుందాం. . !

ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలు వచ్చే నెల 11 వరకు కొనసాగనున్నాయి. సుమారు నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో తెలుగు రాష్ట్రాల్లో ఇండ్లు సందడిగా మారనున్నాయి. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు   శ్రావణ మాసం ఉండగా తరువాత భాద్రపదం రానుంది.

ఈ రోజుల్లో మంచి ముహుర్తాలు

  • ఆగస్ట్ :16,17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30
  • సెప్టెంబర్ : 3, 4, 5 , 8,10,11,13,14

2026 ఆగస్ట్ 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం అయితే వినాయక చవితి వరకు మంచి ముహుర్తాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. 30 రోజుల్లో.. 19 రోజులు బ్రహ్మోండమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో  శ్రావణ మాసాన్ని మంచి రోజులుగా భావిస్తారు. పెళ్లిళ్లే కాకుండా ఎంగేజ్ మెంట్, గృహ ప్రవేశాలు, పూజలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం.. కొత్త ఇళ్ల నిర్మాణం ఇలా మంచి మంచి పనులకు శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.