హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద సామాజిక ప్రభావ వేదిక 'ఏవీపీఎన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2026' భారతదేశంలో తొలిసారి జరగనుంది. ఢిల్లీలోని భారత్ మంటపంలో ఆగస్టు 25 నుంచి 27 వరకు ఈ సదస్సు నిర్వహిస్తారు.
'ఏ బ్లూప్రింట్ ఫర్ యాక్షన్ ఇన్ ఆసియా' థీమ్‌తో సాగే ఈ 13వ ఎడిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా 2,000 మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు.
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రం 2023–-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,054 కోట్లకు పైగా సీఎస్‌ఆర్ నిధులు వెచ్చించింది.
