- అంతర్జాతీయ స్థాయిలో రజతం సాధించిన రిష్విత
- సన్మానించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్ (ప్రమోషనల్ క్లాస్)లో బీసీ గురుకుల స్టూడెంట్ రిష్విత రజత పతకం గెలుచుకుంది. గత నెల 30 నుంచి ఈ నెల 7 వరకు 2026 వరకు ఇటలీలోని గార్డా సరస్సులో ఈ పోటీలు జరగాయి. మెడల్ గెలుచుకున్న రిష్వితను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులులు బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో సన్మానించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న స్పోర్ట్స్ పాలసీలో భాగంగా విద్యార్థులను వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సాహిస్తున్నామన్నారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణం అన్నారు. విద్యార్థులు సమయ పాలన, సమష్టి కృషి తో తెలంగాణకు, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని మంత్రి కొనియాడారు.
