షిరిడీ సాయిబాబాపై విష ప్రచారంపై.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

షిరిడీ సాయిబాబాపై విష ప్రచారంపై.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

షిరిడీ సాయిబాబాపై ఆన్ లైన్ లో జరుగుతున్న విష ప్రచారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. మత సమారస్యాన్ని  దెబ్బతీసి, సమాజంలో అశాంతి రేపేలా దుష్ప్రచారం జరుగుతోందని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. 2026 ఆగస్టు 13 ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

సోషల్ మీడియాలో, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలో ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రచారం అవుతున్న వీడియో కంటెంట్ ను తొలగించేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అభ్యంతరకరమై వీడియోలను తొలగించేందుకు నిర్ధిష్ట గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. .

సాయిబాబాపై ఇటీవలి కాలంలో మతం పేరుతో విద్వేష ప్రచారం జరుగుతోంది. బాబా అసలు పేరు చాంద్‌ మియా అని, ఆయనో జిహాదీ, హంతకుడు, రేపిస్ట్ అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై తాము ఇప్పటికే యూట్యూబ్‌ను సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించింది.