కేసీఆర్ బావమరిది శ్రీనివాస్ రావు కన్నుమూత

కేసీఆర్ బావమరిది శ్రీనివాస్ రావు కన్నుమూత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది శ్రీనివాస్ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రావు.. 2026 ఆగస్టు 13న  ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో కేసీఆర్ బంధు బలగం విషాదంలో మునిగిపోయింది.

యశోద ఆసుపత్రి నుంచి సుచిత్రలోని నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తున్నారు.  శ్రీనివాస్ మృతి వార్తతో సుచిత్రలోని శ్రీనివాస్ నివాసానికి కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు.

శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులను  కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.