శ్రావణమాసం:పూజల మాసం.. ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. .. పూర్తి వివరాలు ఇవే..!

శ్రావణమాసం:పూజల మాసం.. ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. .. పూర్తి వివరాలు ఇవే..!

హిందువులు  వ్రతాలకు.. పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  శ్రావణమాసం ప్రారంభమైంది.  పూజలు.. నోములు.. వ్రతాలు చేసే నెల శ్రావణమాసమే.  ఈఏడాది (2026)   పరాభవసునామ సంవత్సరం లో  ఆగస్టు 13  నుంచి శ్రావణమాసం  ప్రారంభమయింది.. శ్రావణమాసం లో  ఏ పండుగలు ఎప్పుడొచ్చాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

పురాణాలప్రకారం శ్రావణమాసం  నెల అంతా కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  ఈ ఏడాది ( 2026) ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. శివారాధనకు.. అమ్మవారి పూజలకు  ఎంతో విశిష్టమైన ఈ మాసంలో శ్రావణ సోమవారాలు, మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి.  

శ్రావణ మాసంలో జరుపుకోవాల్సిన ముఖ్యమైన రోజులు

శివారాధనకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ సోమవారాల్లో శివుని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శివపురాణం ద్వారా తెలుస్తుంది. 

శ్రావణమాసం ముఖ్యమైన.. విశేషమైన రోజులివే..!

  • ఆగస్టు 17 : మొదటి సోమవారం
  • ఆగస్టు 24 : రెండవ సోమవారం
  • ఆగస్టు 31 : మూడవ సోమవారం
  • సెప్టెంబర్ 7 : 4వ సోమవారం

ఈ నాలుగు సోమవారాల్లో శివుని ప్రత్యేకించి ఆరాధించి, శివ మంత్రాన్ని జపించి, శివుడికి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.  ఇంకా జాతకంలో దోషాలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

శ్రావణ మంగళవారాలు

శ్రావణ మంగళవారం రోజు  మంగళ గౌరీ వ్రతం చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవనం కొనసాగుతుంది.  సౌభాగ్యం కలుగుతుంది. 

  • ఆగస్టు 18 : మొదటి శ్రావణ మంగళవారం
  • ఆగస్టు 25 : రెండవ శ్రావణ మంగళవారం
  • సెప్టెంబర్ 1 : మూడవ శ్రావణ మంగళవారం
  • సెప్టెంబర్ 8 : నాలుగవ శ్రావణ మంగళవారం

ఈ నాలుగు రోజుల్లో గౌరీదేవిని ఆరాధించడానికి, మంగళ గౌరీ వ్రతం జరపడానికి మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

శ్రావణ శుక్రవారాలు

శ్రావణ శుక్రవారం రోజు కూడా మహాలక్ష్మీదేవిని, గౌరీదేవిని, వరలక్ష్మీదేవిని ఆరాధించచ్చు. 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఐదవ శుక్రవారం అమావాస్య వచ్చింది.

  • ఆగస్టు 14 : మొదటి శ్రావణ శుక్రవారం
  • ఆగస్టు 21 : రెండవ శ్రావణ శుక్రవారం. ఆరోజే వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి.
  • ఆగస్టు 28 : మూడవ శ్రావణ శుక్రవారం.
  • సెప్టెంబర్ 4 : 4వ శ్రావణ శుక్రవారం.
  • సెప్టెంబర్ 11: శుక్రవారం వచ్చింది, కానీ ఆ రోజు అమావాస్య వచ్చేసింది


నాగ పంచమి :  ఆగస్టు 17, సోమవారం నాడు వచ్చింది. ఆ రోజు సోమవారం కూడా వచ్చింది కాబట్టి శివుని ఆరాధించడం మంచిది. నాగదేవతను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

రాఖీ పండుగ..రక్షాబంధన్ 2026

రాఖీ పండుగ : ఆగస్టు 28 శుక్రవారం నాడు రక్షాబంధన్ వచ్చింది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి పద్ధతుల్ని పాటించచ్చు. కొత్త యజ్ఞోపవీత ధారణ, అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములు రాఖీ పౌర్ణమిని చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి నాడు చేసే ఆచారాలను, పద్ధతులను పాటించాలి. సత్యనారాయణ వ్రతం వంటివి చేస్తే చాలా మంచిదని పురాణాల ద్వారా తెలుస్తుంది

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.