ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ ఆదాయం రూ.182 కోట్లు

ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ ఆదాయం రూ.182 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఫార్మా సంస్థ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్  జూన్ క్వార్టర్ (క్యూ1)   ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన రూ.182.4 కోట్ల ఆదాయంపై రూ.7.9 కోట్ల  నికర లాభం సాధించింది. తాజాగా ఐపీఓ ద్వారా సేకరించిన నిధుల వినియోగంలో మార్పులకు బోర్డు ఆమోదం తెలిపింది.

 గుమ్మడిదల (సంగారెడ్డి జిల్లా) లో ఇంజెక్టబుల్ ప్లాంట్ నిర్మిస్తున్న సాయికృతి ఫార్మాలో 60 శాతం వాటా కొనుగోలుకు రూ.83.83 కోట్లు వెచ్చించనుంది. జీనోమ్ వ్యాలీలోని ప్రత్యక్ష్ లాబొరేటరీస్‌‌‌‌‌‌‌‌లో 60 శాతం వాటా కోసం రూ.18.02 కోట్లు కేటాయించింది. 

ఆస్ట్రేలియా ప్రాజెక్టు పూర్తి కావచ్చిందని, అమెరికాలో కొత్త సబ్సిడరీ ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ అనిల్ కుమార్ కరుసాల వెల్లడించారు.