క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ ప్రారంభం.. బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున

క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ ప్రారంభం.. బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రెండు దశాబ్దాలకు పైగా బీ2బీ సేవలందిస్తున్న క్యాప్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ లిమిటెడ్, తన అనుబంధ సంస్థ ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 'క్యాప్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌‌‌‌‌ హోమ్ సర్వీసెస్' కన్స్యూమర్ యాప్‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ బ్రాండ్‌‌‌‌‌‌‌‌కు అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ సర్వీసులు, గృహోపకరణాల మరమ్మతులు, పెస్ట్ కంట్రోల్, బ్యూటీ, వెల్నెస్ వంటి అనేక ప్రొఫెషనల్ సేవలు కస్టమర్లకు సులభంగా అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమైన ఈ సేవలను త్వరలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు విస్తరించడమే కాకుండా, నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఎండీ శ్రీకాంత్ కొడాలి తెలిపారు. నమ్మకం, పారదర్శకత, నాణ్యతతో అత్యుత్తమ హోమ్ సర్వీస్ అనుభవాన్ని అందించడానికి క్యాప్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌‌‌‌‌ కట్టుబడి ఉందని వివరించారు.