ఫుట్వేర్ కంపెనీ బాటా ఇండియా లాభం రూ.63 కోట్లు

 ఫుట్వేర్ కంపెనీ బాటా ఇండియా లాభం రూ.63 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ బాటా ఇండియా ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్ (క్యూ1) లో  రూ.978.9 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 4శాతం వృద్ధి నమోదు చేసింది. 

కంపెనీ నికర లాభం 23 శాతానికి పైగా పెరిగి రూ.63.7 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో లాభం రూ.51.7 కోట్లుగా ఉంది. బాటా డైరెక్టర్ల బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.25 చొప్పున ఇంటెరిమ్‌‌‌‌‌‌‌‌ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది.