ఓల్డ్‌సిటీ, వెలుగు: కాటేదాన్ పారిశ్రామికవాడలో జలమండలి నిర్లక్ష్యంతో వేల లీటర్ల తాగునీరు వృథాగా పొంగిపోతోందని పద్మశాలీపురం కాలనీ సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యపై వెంటనే చర్యలు తీసుకుని పైప్‌లైన్‌ను మరమ్మతు చేయాలని జలమండలి అధికారులను కోరింది. పరిశ్రమ అవసరాల కోసం ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి రోడ్డును తవ్వడంతో జలమండలి మంచినీటి పైప్‌లైన్ దెబ్బతింది.
దీంతో లీకేజీ ఏర్పడి వేల లీటర్ల తాగునీరు వృథాగా కారిపోతోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశాలీపురం, మధుబన్ కాలనీ, ఆప్కో కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఒకవైపు ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రెండు రోజులైనా దెబ్బతిన్న పైప్‌లైన్‌ను మరమ్మతు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
