మల్కాజ్ గిరి, వెలుగు: క్యాన్సర్ ను ముందస్తు పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ లీడర్ సోమశేఖర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ సహకారంతో ఏఎస్ రావు నగర్ శ్రీనివాస నగర్ కాలనీలో ఉచిత జీర్ణాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు.
